టాలీవుడ్ సుందరాంగులతో సెక్స్ రాకెట్ నడిపిన సూత్రధారులకు బెయిల్ నిరాకరణ.!
- June 26, 2018
అమెరికా:టాలీవుడ్ సుందరాంగులతో అమెరికాలో సెక్స్ రాకెట్ నడిపిన సూత్రధారుల బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు. USలోని తెలుగు సంఘాల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి.. హీరోయిన్లను అమెరికాకు రప్పించి... వారితో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో అరెస్టయిన మోదుగుమూడి దంపతులు జైలులోనే ఉన్నారు. వాళ్లు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఇల్లినాయిస్ కోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. వారి పిల్లలు శిశు సంరక్షణ కేంద్రంలోనే ఉంటున్నారు.
అమెరికాలో మోదుగుమూడి దంపతులు నడిపిన సెక్స్ రాకెట్ టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. తెలుగు సంఘాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన నటీమణులను వ్యభిచారానికి వాడుకునేవారు. ఒకసారి వాళ్ల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడిన ఓ హీరోయిన్ పంపిన మెయిల్... చీకటి బండారాన్ని బయటపెట్టింది.
తెలుగు సంఘాల పేర్లతో మోదుగుమూడి కిషన్ నకిలీ పత్రాలు సృష్టించి.. హీరోయిన్లను అమెరికాకు రప్పించేవారు. రేటు మాట్లాడుకుని.. డేట్లు ఫిక్స్ చేసే వ్యవహారాలు ఆయన భార్య చంద్రకళ చూసుకునేవారు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న భార్యాభర్తలకు బెయిల్ దక్కలేదు. తదుపరి విచారణ తేదీ కన్ఫామ్ అయ్యాక మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..