గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక సెల్‌:పోలీస్‌ కమిషనర్‌ కార్తీకేయ

- June 26, 2018 , by Maagulf
గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక సెల్‌:పోలీస్‌ కమిషనర్‌ కార్తీకేయ

నిజామాబాద్‌: నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న గల్ఫ్‌ మోసాలను అరికట్టేందుకు పోలీసుశాఖ గల్ఫ్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ కార్తీకేయ తెలిపారు. ఉపాధికోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్యలున్నా గల్ఫ్‌ సెల్‌ను సంప్రదించాలని సీపీ సూచించారు. కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లేవారిని ఏజెంట్లు మోసాలు చేస్తున్నారని వాటిని నియంత్రించేందుకు ఈ సెల్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంప్లాయిమెంట్‌ వీసాలతో విదేశాలకు పంపుతామని నమ్మించి విజిట్‌/టూరిస్ట్‌ వీసాలతో పంపుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. అలా వెళ్లిన వారు మూడు నెలల్లో విదేశాల్లో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుందన్నారు. అక్కడ ఉద్యోగం దొరకక జిల్లాకు చెందిన అనేక అమాయక నిరుద్యోగులు జైలు పాలవుతున్నారన్నారు. గల్ఫ్‌ ఏజెంట్లు ఇటువంటి వీసాలను ఇచ్చి అమాయక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఉ పాధి కోసం గల్ఫ్‌కు వెళ్లే వారందరూ పోలీసుశాఖ ఇచ్చే సూచనలు, సలహాలను తప్పకుండా పాటించాలని సీపీ సూచించారు.

ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌కు కావాల్సిన పత్రాలు

రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల చేత డిమాండ్‌ లెటర్‌, పవర్‌ ఆఫ్‌ అలార్నీ, యాజమాన్యం నుంచి ఉద్యోగ నియామక కాంట్రాక్ట్‌, ఒరిజినల్‌ ప్రతి, జోర్డాన్‌, కువైట్‌, లెబనోన్‌, లిబియా, ఓమన్‌ దేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే నైపుణ్యంలేని శ్రామికులు, ఆడ పనిమనుషులు, ఇంటి పనివారికి సంబంధించి ఉద్యోగ పత్రాలు తప్పనిసరిగా ఇమిగ్రేషన్‌ అధికారులకు సమర్పించాలి.

చేయవలసిన పనులు 

చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు కలిగి ఉండాలి, రాబోయే ఆరు నెలలూ అది చెల్లుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. ఎంపిక చేసిన రిక్రూటింగ్‌ ఏజెన్సీకి అనుమతి ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. పీవోఐ ద్వారా మంజూరు చేసిన రిజిస్ర్టేషన్‌ పత్రాన్ని చూపించాల్సిందిగా ఏజెంట్‌ని అడగాలి. అటువంటి రిజిస్టర్‌ ఏజెంట్‌ వివరాలు తెలియాలంటే ఇమిగ్రేట్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగినై చూసుకోవాలి. ఒరిజినల్‌ పత్రాలు ఏజెంట్‌ వద్ద ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. ఉద్యోగిని నియమించడానికి అ నుమతిస్తూ విదేశీ యాజమాన్యం జారీచేసిన పవర్‌ ఆఫ్‌ అటార్నీ సంబంధిత ఏజెంట్‌ వద్ద తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎటువంటి ఉద్యోగస్థులు అవసరమో వారికి ఇచ్చే జీత భత్యాల వివరాలతో కూడిన డిమాండ్‌ లెటర్‌ ఏజెంట్‌ వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇవ్వబడే స్పెసిమెంట్‌ ఎంప్లాయిమెంట్‌, అగ్రిమెంట్‌ నకలు పత్రం, వీసా తమ పేరు మీద ఉందో లేదో చూసుకోవాలి.

చేయకూడని పనులు 

ఏజెంట్‌ నుంచి ఆమోదయోగ్యమైన రశీదు లేకుండా ఎటువంటి నగదు చెల్లింపులు చేయరాదు. ఉద్యోగ ఒప్పంద పత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోకుండా లేదా వేరే వారు చదివి అర్థమయ్యేలా వివరించకున్న ఉన్న సందర్భంలో ఆయా పత్రాలపై సంతకం చేయొద్దు. స్వదేశంలో సంతకం చేసిన ఒప్పందం పత్రాలు మినహా ఎటువంటి తెల్లకాగితాలపైన కానీ, ఇతర ఒప్పంద పత్రాలపైన ఉద్యోగం చేసే దేశంలో సంతకం చేయొద్దు. విదేశాల్లో పనిచేసే సమయంలో సమ్మేలు, పని ఎగవేయడం, సా మూహిక ప్రదర్శనలు మొదలైనవి చేయరాదు. అవి ఆయా దేశాల్లో నిషేదించబడినట్లు చట్ట వ్యతిరేకమైనవని అటువంటి వారిని దేశానికి (స్వదేశానికి) పంపే అవకాశం ఉంటుంది. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి యొక్క దరఖాస్తుల దారుల నుంచి పోలీసుశాఖ ఆధ్వర్యంలో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం జరుగుతుంది. కావున పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులకోసం ప్రత్యేకంగా పోలీసుశాఖ ఆధ్వ ర్యంలో ఈ గల్ఫ్‌ సెల్‌ ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు. ఇతర వివరాలకు 9490618000 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com