కోలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 'మిస్ ఇండియా'
- June 26, 2018
అందాల పోటీలు, మోడలింగ్ రంగాలు వెండితెరకు మధ్య వారధిగా మారుతున్నాయి. అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకీలుగా ప్రమోట్ అవుతున్నారు కొందరు నటీమణులు. ఇటీవల ఆ జాబితాలో చేరారు బెంగాలీ బ్యూటీ ఉపాసన. 2015లో ఆల్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఉపాసన. దాదాపు 100 వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఆమె. విజయ్ టీవీలో ప్రసారం అయిన 'విల్లా టూ విలేజ్' కార్యక్రమంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత సినిమా రంగం వైపు మళ్ళీ ఈ మధ్యనే '88' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. కానీ '88' అంతకన్నా ముందే ఉపాసన 'ట్రాఫిక్ రామస్వామి' లో నటించింది. ఎపుడైనా.. ఎక్కడైనా.. తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పమంటే 'ట్రాఫిక్ రామస్వామి' అనే చెబుతుందట. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ మోడలింగ్ వృత్తిని మాత్రం వదులుకోను అని చెబుతున్నారు.అవకాశమొస్తే బాలీవుడ్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







