డ్రగ్స్ స్మగ్లింగ్: వలసదారుడి అరెస్ట్
- June 27, 2018
బంగ్లాదేశీ వ్యక్తి, నార్కోటిక్ పిల్స్, డ్రగ్స్‌ని బహ్రెయిన్‌లోకి స్మగ్లింగ్ చేస్తుండగా, ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డాల్ మీల్, చికెన్ బ్రోత్‌లో నిందితుడు డ్రగ్స్‌ని దాచి, తరలించేందుకు ప్రయత్నించాడు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విమానంలో నిందితుడు ఈ డ్రగ్స్‌ని తీసుకురాగా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరానికి పాల్పడేందుకుగాను, బంగ్లాదేశీ ఒకరు నిందితుడికి 200 బహ్రెయినీ దినార్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







