కమర్షియల్‌ వేర్‌హౌస్‌ నిర్మాణం కోసం మూడు రోజుల్లో లైసెన్స్‌

- June 27, 2018 , by Maagulf
కమర్షియల్‌ వేర్‌హౌస్‌ నిర్మాణం కోసం మూడు రోజుల్లో లైసెన్స్‌

దోహా: కమర్షియల్‌ వేర్‌ హౌస్‌ నిర్మాణం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా లైసెన్స్‌ మంజూరు చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేర్కొంది. ఏడు అప్రూవ్‌ మోడల్స్‌తో, ఖతార్‌ ఎకనమిక్‌ జోన్స్‌ కంపెనీ (మంతెక్‌) సహకారంతో ఈ కొత్త ప్రొసిడ్యూర్స్‌ని అమల్లోకి తెస్తున్నారు. ఎలాంటి సమస్యలూ లేకుండా వుంటే, కేవలం మూడు పనిదినాల్లోనే లైసెన్సులు మంజూరవుతాయని అధికారులు తెలిపారు. ఇన్వెస్టర్లకు అనుకూలంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో వుండేలా నిర్ణయాలు తీసుకోవడంలో మినిస్ట్రీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోందని వారు వివరించారు. ఖతార్‌లో బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ని మరింత అనుకూలంగా మార్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడ్తుందని వారంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com