ఒమనీ హనీ మార్కెట్ ప్రారంభం

- June 28, 2018 , by Maagulf
ఒమనీ హనీ మార్కెట్ ప్రారంభం

10వ ఒమనీ హనీ మార్కెట్‌ ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ అహ్మద్‌ బిన్‌ నాజర్‌ అల్‌ బక్రి ఈ మార్కెట్‌ని ప్రారంభించారు. మస్కట్‌ గ్రాండ్‌ మాల్‌లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 40 మంది బీ బ్రీడర్స్‌ ద్వారా సేకరించిన హనీ ఈ మార్కెట్‌లో విక్రయిస్తారు. సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్స్‌ పరిధిలోంచి ఈ బ్రీడర్స్‌ తేనెను సరఫరా చేస్తారు. హనీ తయారీదారులకీ విక్రయదారులకీ అనుసంధానకర్తగా ఈ హనీ మార్కెట్‌ పనిచేస్తుంది. స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి సహాయ సహకారాలు అందించే దిశగా ఒమన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఒమన్‌ హనీ మార్కెట్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com