మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి: ప్రిన్సెస్ సబీకా
- December 11, 2015
అంతర్జాతీయ అత్యున్నత కాన్ఫరెన్స్ 'విమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ఫ్రమ్ పాలసీస్ టు ఇంపాక్ట్' పేరుతో జరిగింది. ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని అభిప్రాయపడింది. మూడు రోజులపాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్ని సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ (ఓఇసిడి) సహకారంతో చేపట్టింది. జాతీయ స్థాయిలో మహిళలకు పురుషులతో సరిసమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాల్లో మహిళలు, వారికి అన్ని రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడంపై విస్తృతమైన చర్చ జరిగింది. ప్రభుత్వ సెక్టార్లు, ప్రైవేటు సెక్టార్లూ దీనికోసం ముందుకు రావాలని వక్తలు ఆకాంక్షించారు. 2014నివేదిక ప్రకారం బహ్రెయిన్‌లో అత్యధిక శాతం మహిళలు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉన్నత స్థానంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. పబ్లిక్ సెక్టార్లో ఎడ్మినిస్ట్రేటివ్ విభాగంలో సీనియర్ పొజిషన్లో సుమారు 45 శాతం మంది మహిళలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మిడిల్ మేనేజ్మెంట్ పొజిషన్లో 59 శాతం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







