అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజియం ప్రారంభం

- December 11, 2015 , by Maagulf
అత్యాధునిక సౌకర్యాలతో మ్యూజియం ప్రారంభం




అత్యాధునిక సౌకర్యాలతో ఒమన్‌లో నేషనల్‌ మ్యూజియంను ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కల్చర్‌ నేషనల్‌ మ్యూజియం డైరెక్టర్‌ జమాల్‌ బిన్‌ హసన్‌ అల్‌ మౌస్సావి మాట్లాడుతూ, అత్యున్నతస్థాయి సౌకర్యాలతో ఈ మ్యూజియం ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అంధులకు వీలుగా బ్రెయిలీ సింబల్స్‌ కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఒమన్‌కి చెందిన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక సాంస్కృతిక విషయాలు ఈ మ్యూజియం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మ్యూజియంను తీర్చిదిద్దారు. ఈ మ్యూజియంలో యుహెచ్‌డి సినిమా థియేటర్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఒమన్‌లో ఇదే తొలి యుహెచ్‌డి సినిమా థియేటర్‌. 12 నిమిషాల ప్రెజెంటేషన్‌ ఈ థియేటర్‌లో ఉంటుంది. ఆరు వేలకు పైగా కళాఖండాలు ఈ మ్యూజియంలో పొందుపర్చబడ్డాయి. పురాతనకాలం నాటి ఆయుధాలు, షిప్‌లు, చారిత్రక నిర్మాణాలకు సంబంధించిన మోడల్స్‌ ఈ మ్యూజియంలో దర్శనమిస్తాయి. వచ్చే సోమవారం ఈ మ్యూజియంను ప్రారంభించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com