మిడ్ డే బ్రేక్ రూల్‌ఉల్లంఘన: 251 కంపెనీలకు నోటీసులు
- July 02, 2018
మస్కట్: మిడ్ డే బ్రేక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న 251 కంపెనీలను మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ గుర్తించింది. మినిస్ట్రీ 1,003 కంపెనీలను సందర్శించగా, 251 కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనీ, 752 కంపెనీలు నిబంధనల్ని పాటిస్తున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగస్ట్ వరకు మిడ్ డే బ్రేక్ రూల్ అమల్లో వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు ఎండ వేడిలో పని చేయడానికి కార్మికుల్ని అనుమతించకూడదు. ఆర్టికల్ 118 ఒమన్ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలకు జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది. 100 నుంచి 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష విధిస్తారు. ఇదే నేరం రిపీట్ అయితే, శిక్ష డబుల్ అవుతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







