20 గంటలు ఆలస్యంగా వెళ్లిన అల్ జజీరా విమానం
- July 04, 2018_1530689328.jpg)
శంషాబాద్:శంషాబాద్ నుంచి కువైట్‌కు వెళ్లాల్సిన ఓ విమానం 20 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో 65 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 2.20గంటలకు జే9-609 అల్‌జజీరా ఎయిర్‌లైన్స్ విమానం శంషాబాద్ నుంచి కువైట్‌కు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఆ విమానం కువైట్ నుంచి శంషాబాద్‌కే రాలేదు. దీంతో ఇక్కడి నుంచి కువైట్ వెళ్లేందుకు బోర్డింగ్ పాసులు తీసుకున్న ప్రయాణికులను సాయంత్రం రావాలని అధికారులు సూచించడంతో కొందరు వెనుదిరిగి వెళ్లగా.. చాలామంది విమానాశ్రయం ఆవరణలో పడిగాపులు కాశారు. సాయంత్రం వచ్చిన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆందోళనకు దిగారు. స్పందించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఎట్టకేలకు రాత్రి 9.30గంటలకు ప్రయాణికులను కువైట్‌కు పంపించడంతో వివాదం సద్దుమణిగింది
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్