హత్య చేసి యు.ఏ.ఈ కి పారిపోయిన నిందితుడి అరెస్ట్
- July 04, 2018
హైదరాబాద్:భార్యను హత్య చేసి సౌదీకి పారిపోయిన ఘటనలో ప్రధాన నిందితుడిని డబీర్‌పుర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండల డీసీపీ సత్యానారయణ..డబీర్‌పుర ఇన్స్పెక్టర్ వెంకన్ననాయక్తో కలిసి వివరాలు వెల్లడించారు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పర్థాగేట్కు చెందిన జబనాజ్ (30)కు ఏడేండ్ల క్రితం డబీర్‌పుర ప్రాంతానికి చెందిన అక్బర్‌అలీఖాన్ (33)తో వివాహం జరిగింది. అక్బర్‌అలీఖాన్ ఉద్యోగరీత్యా సౌదీలో ఉంటున్నాడు. కొన్నేండ్ల తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో జబనాజ్... తల్లిగారింటి వద్ద ఉంటుంది. అక్బర్‌అలీఖాన్ అప్పుడుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు.
అయితే అక్బర్‌ఖాన్.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కోపంతో అక్బర్‌ఖాన్ మే 19న నగరానికి వచ్చా డు. భార్యను తీసుకుని డబీర్‌పురాలోని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్బర్‌అలీఖాన్ కోపంతో భార్య తలపై బలంగా రాడ్‌తో మోది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో డబీర్‌పుర రైల్వేట్రాక్ వద్ద వదిలేసి...యు.ఏ.ఈకి వెళ్లిపోయాడు. ఈ కేసులో హత్యకు సహకరించిన అక్బర్‌అలీఖాన్ తల్లితోపాటు అతని సోదరులను డబీర్‌పుర పోలీసులు మే 21న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.యు.ఏ.ఈ ఎంబసీ అధికారుల చొరవతో ...నిందితుడిని నగరానికి రప్పించడానికి డబీర్‌పుర, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పూర్తి వివరాలను యు.ఏ.ఈ ఎంబసీ అధికారులకు అందించారు. దీంతో అక్కడి అధికారులు నిందితుడు అక్బర్‌అలీఖాన్ పాస్‌పోర్టును సీజ్ చేసి నగరానికి తరలించారు. ఇక్కడ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని డీసీపీ వెల్లడించారు. అనంతరం నిందితుడు అక్బర్అలీఖాన్ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నామని, హత్యకు పురిగొల్పిన వివరాలతోపాటు ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







