దాహం... దాహం... ఎందుకు? చల్లటి మజ్జిగతో.....
- July 06, 2018
మనిషి శరీరంలో నుండి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో బయటకుపోయే నీరు శాతమే ఎక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి.
మమూలుగా ఇవి రెండు రక్తంలో స్థిరంగానే ఉంటాయి. ఏ కారణం చేతనయినా రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. కొందరికైతే వేసవికాలం, వర్షాకాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది. వారికి ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాసు చల్లని నీటిలో 4 స్పూన్ల చక్కెర, నిమ్మరసం కలుపుకుని త్రాగితే వెంటనే దాహం తగ్గుతుంది.
అదేవిధంగా దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి 2 స్పూన్స్ రోజుకి మూడుసార్లు త్రాగితే దాహం తగ్గుతుంది. మెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే త్వరగా దాహం తగ్గి వడదెబ్బ నుంచి విముక్తి కలుగుతుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!