జూలై 16న సిద్ధంగా ఉండండి. ఆరోజు మిస్సయితే..
- July 06, 2018
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారీ డీల్ కు తెరతీయబోతోంది. ఈనెల 16 న అమెజాన్ ప్రైమ్ వార్షికోత్సవం సందర్బంగా పలు ఆఫర్లతో ముందుకువస్తోంది. సరిగ్గా జులై నెల 16 న 12 గంటలకు మొదలయ్యి 36 గంటలపాటు ఈ అవకాశం అందుబాటులో ఉండనుంది. గతేడాది కేవలం 30 గంటలు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ ఈ ఏడాది 36 గంటలపాటు ఉంటుందని అమెజాన్ తన బ్లాగుల్లో పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ డే టు డేట్ లో.. ఆస్ట్రేలియా, లక్షంబర్గ్ , నెథర్లాండ్, సింగపూర్ అలాగే యూఎస్, యూకే, స్పెయిన్, ఇండియా, మెక్సికో, జపాన్, ఇటలీ, జెర్మనీ, ఫ్రాన్స్, చైనా, కెనడా, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
కేవలం 36 గంటలపాటు టీవీ, స్మార్ట్ హోమ్, కిచెన్, గ్రోసరీ, టాయ్స్, ఫాషన్, ఫర్నిచర్, అప్లయెన్సెస్, మరియు నిత్యావసరాలకు సంబంధించిన పలు వస్తువులు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి, అమెజాన్ తన సొంత పరికరాలను 'ప్రైమ్ డే' కోసం ఆఫర్ చేస్తోంది, ఒప్పందాల్లో కొన్నింటిని ముందుగానే వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఫైర్ టీవీ మరియు ఫైర్ టాబ్లెట్స్ మీద అతి తక్కువ ధరలతో అమెజాన్ పరికరాలపై "డబుల్ డీల్స్" అందించనున్నట్టు అమెజాన్ రిటైలర్ తెలిపింది. కాగా ఈ ఏడాది 'సరికొత్త హోమ్ సెక్యూరిటీ' డివైసెస్ ను ఈ డీల్ ద్వారా అందుబాటులోకి తేనుంది.
ఈ ప్రైమ్ డే రోజు షాపింగ్ చేసిన వారికీ10 శాతం ఆఫర్ ఇవ్వనుంది. అలాగే వందల వస్తువులపై భారీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఈ క్రమంలో ప్లస్ ప్రైమ్ రివార్డ్స్ వీసా కార్డు సభ్యులు డబుల్ బహుమతులు అందుకుంటారని - 10 శాతం ఆఫర్ అమౌంట్ తిరిగి జూలై 14 నుండి 17 మధ్య ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే సేల్ అవుతున్న వస్తువులపై కూడా డిస్కౌంట్లు ఇవ్వనుంది అమెజాన్..
*ఎకో షో – save $100 (సాధారణంగా $229).
*అమెజాన్ ప్రొడక్ట్స్.. ఫర్నిచర్ మరియు డెకార్స్ పై 25 శాతం, అమెజాన్ బేసిక్ ఐటమ్స్ పై 20 శాతం, నిత్యావసర వస్తువులపై 30 శాతం ఆఫర్ ఇవ్వనుంది.
*అలాగే అమెజాన్ ప్రైమ్ మూవీ.. డీవీడీ, బ్లూరే లపై 50 శాతం ఇస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







