సినీ తారాల సెక్స్ రాకెట్ కేసులో ఆయనపై..
- July 06, 2018
చికాగో సెక్స్ రాకెట్ కేసులో తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన ప్రతిష్ట దిగజారేలా సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న తెనాలికి చెందిన వల్లభవేని భార్గవ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉంటూ భార్గవ్‌కు సహకరించిన మరో నలుగురిపైనా కేసులు నమోదు చేశారు. ఒల్లేటి వెంకట మోహన్, పరుచూరి ఫణిదర్, పుట్టి శరత్ , గోపాలకృష్ణలపై విచారణ పూర్తైన తర్వాత లుక్ అవుట్ నోటీస్ జారీ చేస్తామని అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు తెలిపారు.
అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలన స్పష్టించిన సెక్స్ రాకెట్ కేసులో వేమన సతీష్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సతీష్ స్నేహితుడు మగులూరి హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన గుంటూరు పోలీసులు.. తప్పుడు ప్రచారానికి సంబంధించిన ఆధారాలు సంపాదించారు. కీలక నిందితుడు వల్లభ్‌ను అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న మిగితా నలుగురిని విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







