బ్యాడ్ వెదర్: దుబాయ్‌లో వందలాది ప్రమాదాలు
- July 06, 2018
దుబాయ్:వెట్ మరియు డస్టీ వెదర్ కండిషన్స్ కారణంగా, శుక్రవారం 200కి పైగా రోడ్డు ప్రమాదాలు దుబాయ్‌లో జరిగాయి. దుబాయ్ పోలీస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం 252 ట్రాఫిక్ యాక్సిడెంట్స్ శుక్రవారం సాయంత్రం నమోదయ్యాయని లెఫ్టినెంట్ కల్నల్ టుర్కి అబ్దుల్లా బిన్ ఫారిస్ (దుబాయ్ పోలీస్ డైరెక్టర్ - కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) వెల్లడించారు. వర్షం, ఇసుక తుపాను కారణంగా మరో 58 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చెట్లు కూలిపోవడం కూడా జరిగిందని లెఫ్టినెంట్ కల్నల్ బిన్ ఫారిస్ చెప్పారు. చెట్టు కూలిన ఘటనలో ఓ మహిళ గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలనీ, తగిన వేగంతో రోడ్లపై ప్రయాణించాలని సూచించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







