హజ్‌ సీజన్‌ కోసం ఎమిరేట్స్‌ ఎక్స్‌ట్రా ఫ్లైట్స్‌

- July 06, 2018 , by Maagulf
హజ్‌ సీజన్‌ కోసం ఎమిరేట్స్‌ ఎక్స్‌ట్రా ఫ్లైట్స్‌

హజ్‌ కోసం సౌదీ అరేబియా వెళ్ళాలనుకునేవారికోసం ఎమిరేట్స్‌ ప్రత్యేక విమానాల్ని జెడ్డా, మదీనాలకు ఏర్పాటు చేయనుంది. ఆగస్ట్‌ 6 నుంచి 31 వరకు మొత్తం 33 అదనపు విమానాల్ని నడపనున్నట్లు ఎమిరేట్స్‌ పేర్కొంది. ఎమిరేట్స్‌కి చెందిన రెగ్యులర్‌ విమానాలతోపాటు ఈ ప్రత్యేక విమానాలు నడుస్తాయి. హజ్‌ వీసా వున్నవారికి ఈ విమానాల్లో అనుమతిస్తారు. పాకిస్తాన్‌, జెనెగల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, యూకే, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఐవరీ కోస్ట్‌, నైజీరియా నుంచి ఈ విమానాలకు ఎక్కువ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎమిరేట్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌ ఆపరేషన్స్‌ - గల్ఫ్‌, మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఇరాన్‌) అదిల్‌ అల్‌ ఘయిత్‌ మాట్లాడుతూ, ముస్లింలకు హజ్‌ ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. 25,000 మందికి పైగా ఫిలిగ్రిమ్స్‌ ఈ ఏడాది ఎమిరేట్స్‌ ద్వారా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com