ఘనంగా వైఎస్ఆర్ 69వ జయంతి..
- July 07, 2018
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిల, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి సహా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
పాదయాత్రలో ఉన్న కారణంగా జగన్ ఇక్కడికి రాలేకపోయారు. ప్రజాసంకల్పయాత్రలోనే మహానేతకు నివాళులు అర్పించనున్నారు. వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయమ్మ సహా అంతా నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ప్రార్థనల సందర్భంగా విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. అటు, పులివెందులలో జరిగిన కార్యక్రమంలో వివేకానందరెడ్డి.. వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
వైఎస్ జయంతి సందర్భంగా జగన్ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ పాదయాత్రలో 2500 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది యాధృచ్చికమే కాదు.. ఏపీ ప్రజలతోపాటు నాన్న ఆశీస్సులు కూడా ప్రతిబింబించేలా ఉందన్నారు. హ్యాపీ బర్త్‌డే నాన్న అంటూ, ఎప్పుడూ అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ జగన్ రాసుకొచ్చారు.
ప్రస్తుతం జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. మండపేట నియోజకర్గం నుంచి ముందుకు సాగుతున్న ఆయన.. ఇవాళ పసలపూడి నుంచి యాత్ర ప్రారంభింస్తారు. చెల్లూరు మీదుగా మాచవరం వరకూ నడక సాగుతుంది. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర 208వ రోజుకు చేరింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి.. జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అటు, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







