పెద్దఎత్తున గల్ఫ్ దేశాల నుండి భారత్ కు డబ్బు
- July 09, 2018
డాలర్‌తో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందన్న వార్తలు దేశప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే గల్ఫ్ లోని భారతీయులు మాత్రం పండుగ చేసుకొంటున్నారు. డాలర్ కి అధిక మారక రేటు వస్తుండటంతో పెద్ద ఎత్తున తమ డబ్బుని స్వదేశంలోని తమ కుటుంబాలకి పంపుతున్నారు. గత పదిహేను రోజులుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు పంపే డబ్బులో హఠాత్తుగా 20-30 శాతం పెరుగుదల ఉన్నట్టు మనీ ఎక్స్చేంజ్ సంస్థలు చెబుతున్నాయి.
ప్రవాస తెలుగువారు రూపాయి పతనాన్ని పూర్తిగా వాడేసుకుంటున్నారు. డాలర్ల రూపంలోని తమ డబ్బును ప్రవాహంలా సొంతవారికి పంపుతున్నారు. తమ దగ్గరున్న మొత్తానికి మారకంలో కొన్ని రెట్ల మొత్తం పెరుగుతుండటంతో వారు అందినచోటల్లా డబ్బు తెచ్చి కుటుంబాలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడి పొదుపు చేసిన మొత్తాన్ని ఒకేసారి ఇంటికి పంపినవారు కొందరైతే దుబాయ్ లోని మరికొందరు తెలుగువారు తమ ఆఫీసుల్లో అడ్వాన్సులు, లోన్ల పేరిట డబ్బు తీసుకొని మరీ భారత్ కు తరలిస్తున్నారు. దుబాయ్, అబుదాబీ, సౌదీ అరేబియా.. అన్ని గల్ఫ్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







