ప్రధానికి ఊహించని పరిణామాలు.. విదేశాంగ మంత్రి రాజీనామా..
- July 09, 2018
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో బ్రిటన్ ప్రధాని థెరీసా మే ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా బ్రెగ్జిట్ ప్లాన్ రూపొందించండంలో కీలక పాత్ర పోషించిన మంత్రి డేవిస్‌తోపాటు, విదేశాంగ మంత్రి జాన్సన్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బ్రెగ్జిట్ ప్లాన్‌కు కేబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు థెరీసా మే. ఆ తర్వాత వెంటనే పరిణామాలు మారిపోయాయి. బ్రెగ్జిట్ ఫైల్‌ను పార్లమెట్ ముందు పెట్టే సమయంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో ఆమెపై ఒత్తిడి పెరిగింది. కస్టమ్స్ యూనియన్, సింగిల్ మార్కెట్‌ను వదిలేందుకు పూర్తిస్థాయి ప్రాణాళిక లేకుండా ముందుకు వెళ్తే ఎలాంటి ఉపయోగం ఉండబోదని రిజైన్ చేసిన బ్రెగ్జిట్ మంత్రి డేవిస్ అన్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతున్నందున రాయితీల విషయంలోనూ అస్పష్టంగా ఉన్న వైఖరితో తాను విభేదిస్తున్నానన్నారు. ఆయన థెరేసా మే కేబినెట్ నుంచి తప్పుకుంటారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. చివరికిప్పుడు విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా రిజైన్ చేయడం, ఆయన కూడా తాజా పరిణామాలు తనకు మింగుడు పడడం లేదని చెప్పడం బట్టి చూస్తే అంతర్గతంగా ఉన్న సంక్షోభానికి అద్దం పడుతోందంటున్నారు.
అటు, బ్రెగ్జిట్ ప్రణాళిక బలహీనంగా మారుతోందంటూ వచ్చిన వాదనను థెరీసా మే తోసిపుచ్చారు. ఇద్దరి రాజీనామాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయన్న ప్రధాని.. రిఫరెండం తర్వాతే బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలైనట్టు గుర్తుచేశారు. పలు దఫాల చర్చల తర్వాతే ఫైల్ సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. ఈయూ నుంచి విడిపోయేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసే దిశగా ఇన్నాళ్లూ డేవిస్ చేసిన కృషిని ప్రశంసించారు.
మరోవైపు, వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని థెరీసా పట్టుదలగానే ఉన్నా, కన్జర్వేటివ్ పార్టీలో ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి దారి తీస్తుందా అన్న అనుమానాలు కూడా ఉ్నాయి.
అటు, ఈ పరిణామాల్ని యూరోపియన్ యూనియన్ కూడా ఆసక్తికరంగా గమనిస్తోంది. ఇద్దరు మంత్రుల రాజీనామా తర్వాత మారిన సమీకరణాల్ని బట్టి చూస్తే బ్రెగ్జిట్‌పై యూ-టర్న్ తీసుకునే అవకాశం ఉండొచ్చమని EU ప్రెసిడెంట్ డోనాల్డ్ టస్క్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







