హిట్ టాక్ తెచ్చుకుంటున్న 'బ్రాండ్ బాబు' టీజర్

- July 09, 2018 , by Maagulf
హిట్ టాక్ తెచ్చుకుంటున్న 'బ్రాండ్ బాబు' టీజర్

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. ఈ చిత్రానికి మారుతి కథ అందించాడు. సుమత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ, మురళీశర్మ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్‌.ఎస్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

ఎదుటోడి ఒంటిమీద బ్రాండ్ కనబడక పోతే అతడి నోటి నుండి మాట కూడా రాదు, తాగే వాటర్ నుండి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వస్తువే అయుండాలి..... అనేది హీరో క్యారెక్టరైజేషన్‌. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆమె బ్రాండెడ్ వస్తువులంటే కూడా తెలియని పేద అమ్మాయి అని తెలిసి షాకవుతాడు. ఊర్లో ఉన్న దరిద్రం అంతా ఈవిడ దగ్గరే ఉందని ఫీలైన హీరో చివరకు ఆమె ప్రేమలో ఎలా పడ్డాడు అనేది సినిమా మూల కథ అని తెలుస్తోంది.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ మారుతి చాలా సింపుల్‌గా కథ రాస్తాడు. అందుకే నాకు తనంటే విపరీతమైన గౌరవం. మారుతి తొలి సినిమా సక్సెస్ కాగానే, తన చుట్టుపక్కనున్న వారి సక్సెస్ గురించి ఆలోచించాడు. ప్రభాకర్‌ ఎప్పుడూ బిజీ పర్సన్‌. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ నువ్వే సినిమాతో మంచి టెక్నీషియన్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. మనం చేయాలనుకున్న పని చేయడమే సక్సెస్‌. అది నలుగురికీ నచ్చడం బోనస్‌. హీరో చాలా బాగా చేశాడు అని అన్నారు.

జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

నటీనటులు:
సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్.

సాంకేతిక నిపుణులు:
స్టోరి: మారుతి
డైరెక్టర్: ప్రభాకర్.పి
నిర్మాత: ఎస్. శైలేంద్ర
బ్యానర్: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
మ్యూజిక్: జేబి
లిరిక్స్: పూర్ణచెర్రీ
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి
పి ఆర్ ఓ: వంశీశేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com