12 లక్షల సీట్లపై డిస్కౌంట్ ఆఫర్
- July 09, 2018
న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా 12 లక్షల సీట్ల ఛార్జీలను అత్యంత తక్కువగా రూ.1,212కే ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ టిక్కెట్లు 2018 జూలై 25 నుంచి 2019 మార్చి 30 వరకు ప్రయాణ కాలానికి వర్తించనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఇండిగో సేల్ మంగళవారం నుంచి ప్రారంభమై, శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సేల్ వివరాలను ఇండిగో క్యారియర్ తన వెబ్సైట్లో పొందుపరిచింది. అన్ని ఛానల్స్ ద్వారా బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లకు ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుందని ఇండిగో తెలిపింది. తక్కువ విమాన టిక్కెట్ ఛార్జీలే కాక, ఈ ఎయిర్‌లైన్ ఎస్బీఐ కార్డు ద్వారా పేమెంట్లు జరిపే బుకింగ్స్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందించనున్నట్టు కూడా పేర్కొంది. అయితే కనీస లావాదేవీ రూ.3000 మేర ఉండాలి. ఒక్కొక్కరికి 500 రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. 2018 సెప్టెంబర్ 14న క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని కస్టమర్ల అకౌంట్లో క్రెడిట్ చేయనున్నారు.
‘దేశీయ విమానయాన సంస్థ సీట్లపై అతిపెద్ద సేల్‌ను ప్రకటించడం ఆనందాయకంగా ఉంది. ఆగస్టు 4న ఇండిగో 12వ ఏటా అడుగుపెడుతోంది. ఈ సందర్భాన్ని తీపి గుర్తుగా మరలుచుకునేందుకు, 57 సిటీల్లో తమ నెట్వర్క్ వ్యాప్తంగా ఉన్న 12 లక్షల సీట్లను ప్రత్యేక ధరల్లో అందుబాటులో ఉంచాం’ అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. దేశీయంగా ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం 1,086 రోజువారీ విమానాలను ఇది ఆపరేట్ చేస్తోంది. 42 దేశీయ, 8 అంతర్జాతీయ మార్గాలను ఇది కనెక్ట్ చేస్తోంది. గోఎయిర్, ఎయిర్ఏసియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ సేల్ ప్రకటించిన అనంతరం ఇండిగో ఈ ఆఫర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







