శీతాకాలంలో అగ్ని ప్రమాదాలు
- December 12, 2015
ఒమన్‌లో వాతావరణం చల్లబడింది. చలి తీవ్రత పెరగడంతో ప్రతి ఒక్కరూ వెచ్చదనం కోసం వివిధ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఇంట్లో సరైన ఏర్పాట్లు లేకుండా 'వేడి' చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. బార్బిక్యూ వంటి తాత్కాలిక ఏర్పాట్లు, ఆ సమయంలో వహించే అజాగ్రత్తతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ సీనియర్ అధికారి చెప్పారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి తరచూ అనేక ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని ఆయన అన్నారు. ఇంటిని వేడిగా ఉంచేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ పరికరాల పట్ల వహించే అజాగ్రత్త కూడా ప్రమాదాలకు కారణమని ఆయన చెప్పారు. 2014లో సుమారు 3335 ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 23 శాతం ఇంట్లో ఏర్పాట్ల వల్లే జరిగినట్లు తేలింది. మొత్తం 755 ఇళ్ళు గత ఏడాది దగ్ధం అయ్యాయి. వాటర్ హీటర్స్ వాడేటప్పుడు నాణ్యతగలవాటి కోసం చూడాలని వినియోగదారులకు అధికారులు సూచించారు. ఇంట్లోని ఎలక్ట్రిక్ వస్తువులను ఎప్పటికప్పుడు నిపుణులతో తనిఖీ చేయిస్తే ప్రమాదాలు తగ్గుతాయని వారు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







