నేషనల్ డే ఉల్లంఘనలు: 427 కార్ల స్వాధీనం
- December 12, 2015
నేషనల్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు పెద్దగ తలెత్తలేదు. అన్ని చోట్లా తగిన విధంగా సిబ్బందిని నియమించడం, అలాగే నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై నిఘా పెట్టడం ద్వారా ఉల్లంఘనల్ని చాలావరకు తగ్గించగలిగారు. అయితే నిబంధనల్ని ఉల్లంఘించిన 427 కార్లను మాత్రం ట్రాఫిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చట్టాలను లెక్క చేయకుండా కార్లను డెకరేషన్ చేయడం, మితిమీరిన శబ్దంతో హారన్ మోగించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలకు పాల్పడినందుకు ఆ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబీ పోలీస్, ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ హుస్సేన్ అహ్మద్ అల్ హరితి మాట్లాడుతూ, ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాల్సిందేనని చెప్పారాయన. వాహనదారులు తమ వాహనాలకు ఏర్పాటు చేసిన డెకరేషన్లను తొలగించాలనీ, లేదంటే ఫైన్ విధింపబడ్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల, రోడ్లపై వాహనదారుల భద్రత పట్ల అవగాహన కల్గించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతోంది ట్రాఫిక్ విభాగం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







