'గీత గోవిందం' సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల
- July 10, 2018
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా రూపొందుతుందని అంటున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల కాగా, ఇది అభిమానులలో ఆసక్తి కలిగించింది . పోస్టర్ ని చూసి అర్జున్ రెడ్డి తరహాలో ఈ సినిమాలోను డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఇక ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాటని విడుదల చేసేందుకు సన్నద్దమయ్యారు మేకర్స్ . 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ సాగే ఈ పాటను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సంగీత ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. మరి ఆ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి







