`మై డియర్ మార్తాండం` ఫస్ట్ లుక్
- July 10, 2018
థర్టీ ఇయర్స్ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో డైలాగుతో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ పృథ్వి ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్లో టాప్ కమెడియన్‌గా ఎదిగారు. ఆయన ప్రధాన పాత్రలో మై డియర్ మార్తాండం అనే సినిమా రాబోతోంది. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కె.వి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ... నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ - కమెడియన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీగారు టైటిల్ పాత్రలో నటిస్తున్నారని తెలిపారు.
"ముప్పై రోజుల్లో లాయర్ అవడం ఎలా"? అనే పుస్తకాన్ని చదివిన డిఫెన్స్ లాయర్ పాత్రలో పృథ్వీగారి నటన సినిమాకే హైలైట్ కానుంది. క్రైమ్ కామెడీగా కోర్టు రూమ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పస్ట్‌లుక్ విడుదల చేశాం. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్, కల్పిక గణేశ్, కల్యాణ్ విట్టపు, తాగుబోతు రమేశ్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రవీణ్, మ్యూజిక్: పవన్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, సినిమాటోగ్రఫీ:ర్యాండీ, నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్, రచన, దర్శకత్వం: హరీష్ కె.వి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







