నెట్ న్యూట్రాలిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టెలికాం కమిషన్
- July 11, 2018
న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి టెలికాం కమీషన్ ఓకే చెప్పేసింది. ఈ ప్రక్రియతో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ ఒకేరకమైన వేగంతో అందుతుంది. నెట్ న్యూట్రాలిటీ పద్ధతిని అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. టెలికాంతో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు .. ఇంటర్నెట్ డేటాను సమానంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫామ్ ఏదైనా, అప్లికేషన్ ఏదైనా, యూజర్ ఎవరైనా, కాంటెంట్ ఏదైనా అందరికీ ఒకేరకమైన వేగంతో ఇంటర్నెట్ అందజేయడమే నెట్ న్యూట్రాలిటీ లక్ష్యం. ఇంటర్నెట్ డేటాను ప్రొవైడ్ చేస్తున్న సంస్థలు కాంటెంట్‌ను బ్లాక్ చేయడం కానీ, స్పీడ్ తగ్గిండచం కానీ చేయకూడదు. టెలికం శాఖకు చెందిన టెలికాం కమీషన్ నెట్ న్యూట్రాలిటీపై బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగానే టెలికాం కమీషన్ నెట్ న్యూట్రాలిటీకి గ్రీన్ సిగ్నల్ చెప్పినట్లు టెలికాం సెక్రటరీ అరుణా సుందరరాజన్ తెలిపారు. నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేసిన సిఫార్సుల పట్ల ఇంటర్నెట్ సంస్థలు, టెలికం ఆపరేటర్ల నుంచి గతంలో విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంటర్నెట్ సేవల సంస్థలు ప్రశంసించగా, టెలికం కంపెనీలు.. ఈ అంశానికి ట్రాయ్ చాలా చిన్న నిర్వచనం చెప్పిందన్నాయి.
వాట్సప్, స్కైప్, వైబర్, గూగుల్ డ్యుయో వంటి లైసెన్సింగ్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు అందిస్తున్న కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన అంశాలపై ట్రాయ్ దృష్టి పెట్టినట్లు లేదని విమర్శించాయి. జాతి అవసరాలకు సంబంధించిన ఈ అంశంపై సంకుచిత ధోరణి తగదన్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







