చి.ల.సౌ..టీజర్
- July 11, 2018
అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తాజా చిత్రం చి.ల.సౌ. అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సుశాంత్ చివరిగా ఆటాడుకుందాం.. రా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. రుహని శర్మ చి.ల.సౌ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ఇటీవల చిత్ర టీజర్ విడుదలైంది. హీరో వర్షెన్‌కి సంబంధించిన టీజర్ అలరించింది. తాజాగా పెళ్లి కూతురు వర్షెన్‌కి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ ప్రతి ఒక్కరికి కత్రినా కైఫ్ కావాలి అనుకుంటారు, కాని ఎవడు రణ్‌బీర్ లా ఉండరు అని అంటుంది. టీజర్‌లని బట్టి చూస్తుంటే చి.ల.సౌ మూవీ మంచి ఎంటర్‌టైనింగ్ ఉంటుందని తెలుస్తుంది. సుశాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తాజాగా విడుదైలన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







