వీర భోగ వసంత రాయలు టైటిల్ పోస్టర్
- July 11, 2018
కెరీర్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న హీరో నారా రోహిత్. త్వరలో ఆటగాళ్లు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నారా రోహిత్ ప్రస్తుతం వీర భోగ వసంత రాయలు అనే సినిమా చేస్తున్నాడు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీ విష్ణు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ అభిమానులలో ఆసక్తి కలిగిస్తుంది. శ్రియ కూడా చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆమె పాత్ర కూడా ముగ్గురు హీరోలకి సమానంగా ఉంటుందని అంటున్నారు. అప్పారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంద్రసేన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి తర్వాత శ్రియ చేయబోవు తొలి సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక ఇటీవల సమ్మోహనం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక అసుర ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న తిప్పరా మీసం చిత్రంతో బిజీగా ఉన్నాడు శ్రీ విష్ణు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







