వరంగల్ మహిళ కౌసర్‌కు అరుదైన అవకాశం
- July 12, 2018
వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. గత కొద్ది రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలుకరించేందుకు ప్రధాన మంత్రి జన్‌సంవాద్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) వర్గానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. ఈ క్రమంలో మోదీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్‌కు లభించింది. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కౌసర్.. ప్రధానితో ముచ్చటించారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో మహిళలు పొదుపు పాఠాలు చెప్పిన కౌసర్.. ఎంతో మంది మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ నేడు దేశవ్యాప్తంగా ఆమెకు ఖ్యాతిని పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







