విజయ్ కి జోడీగా కాజల్
- July 12, 2018
పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండ కమిటైన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించే సినిమా కూడా ఉందని తెలిసింది. ఈ చిత్రాన్ని కె.ఎస్‌రామారావు నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిత్ర కథనం ప్రకారం కొత్తగూడెం కోల్‌మైన్స్‌లో షూటింగ్ చేస్తారని తెలిసింది. విజయ్ దేవరకొండ వైవిథ్యమైన పాత్రలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా కాజల్‌ను ఎంపికచేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కుర్ర హీరోలతో నటించేందుకు కాజల్ సై అంటోంది. దానికి తగినట్టుగానే ఆమెకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే రానా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సినిమాలు చేస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో నటిస్తూ యువ ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







