నకిలీ పాస్ పోర్ట్ లను సైతం ఐఎస్ఐఎస్ తయారు!
- December 12, 2015
అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆధునిక టెక్నాలజీని అన్ని రకాలుగా వాడుకోవడంలో ముందుంటుంది. ప్రచారంలో సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న ఈ ఉగ్రవాదసంస్థ గురించి తాజాగా విస్మయ పరిచే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాల కోసం తమ సభ్యులకు నకిలీ పాస్ పోర్ట్ లను సైతం ఐఎస్ఐఎస్ తయారు చేస్తుందని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇంటలిజెన్స్ విభాగం తెలిపింది. సిరియాలోని ప్రభుత్వ భవనాలను కొన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐస్ ఉగ్రవాదులు అక్కడి పౌరుల వివరాలను మొత్తం సేకరించారని, పాస్ పోర్ట్ తయారీ యంత్రాలను, పాస్ పోర్ట్ బ్లాంక్ పుస్తకాలను కూడా సమకూర్చుకున్నారని, తద్వారా సులభంగా పాస్ పోర్ట్ లను తయారు చేసుకోగలుగుతున్నారని నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే పలువురు నకిలీ పాస్ పోర్ట్ ల ద్వారా అమెరికాలోకి ప్రవేశించి ఉంటారనే అనుమానాన్ని ఎఫ్ బీఐ వ్యక్తం చేస్తోంది. త్వరలోనే చిప్ తో కూడినటువంటి పాస్ పోర్ట్ లను తయారు చేసి, నకిలీ సమాచారానికి తావు లేకుండా బయోమెట్రిక్ విధానం ద్వారా సమాచారాన్ని నిక్షిప్తం చేయాలనే యోచనలో అమెరికాప్రభుత్వం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







