ముస్లింల కోసమే ఆ సినిమా ఒప్పుకొన్నా!
- July 14, 2018
ముస్లింల కోసమే ఆ సినిమా ఒప్పుకొన్నా! తాప్సి ముంబయి: విభిన్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సి. 'చష్మే బద్దూర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తాప్సి ఆ తర్వాత 'నామ్ షబానా', 'పింక్', 'జుడ్వా 2' తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తాప్సి 'ముల్క్' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రిషి కపూర్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారిన 'ఇస్లామోఫోబియా' నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తాప్సి ముస్లిం కుటుంబానికి చెందిన న్యాయవాదిగా కన్పించనున్నారు. అయితే, తాను ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం ముస్లింలేనని అంటున్నారు తాప్సి. ఈ విషయాన్ని ఆమె 'ముల్క్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వెల్లడించారు. 'ఎక్కడున్నా పేలుళ్లు, కాల్పులు జరిగితే అందుకు కారణం ముస్లింలేనని వారిని విమర్శిస్తుంటారు.
అలాంటివి విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక్కోసారి కోపం వస్తుంటుంది కూడా. ఎందుకంటే ముస్లిం మతానికి చెందిన కొందరు ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడితే దానికి అందరు ముస్లింలను నిందించడం సబబు కాదు. ఇండస్ట్రీలో నాతో కలిసి పనిచేసేవారిలో చాలా మంది ముస్లింలే.
అలాగని వారిని కూడా ఉగ్రవాదులతో పోల్చలేం కదా. అందరు ముస్లింలు చెడ్డవారు కాదు. వారికి మద్దతు తెలపడానికే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను' అని వెల్లడించారు తాప్సి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







