రన్వే పై జారిన ఫ్లైట్
- July 14, 2018
కొచ్చి: ఖతార్‌లోని దోహ నుండి 306 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం కొచ్చిలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్‌వేపై జారినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా రన్‌వే తడిసి నీరు నిలిచిపోయి ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జారినట్లు అధికారులు పేర్కొన్నారు. విమాన పైలెట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. రన్‌వేపై పక్కగా ఉన్న పన్నెండు విద్యుత్ దీపాలు దెబ్బతిన్నాయని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు ఖతార్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. దీంతో దుబాయ్ వెళ్లాల్సిన రెండు విమానాలు ఆలస్యమైనట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా విమానాన్ని రద్దు చేసి అందులో ప్రయాణించాల్సిన వారికి వేరే విమానాన్ని కేటాయించినట్లు ఖతార్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







