ఇంద్రగంటి సినిమాలో హీరోలు ఎవరో తెలుసా?
- July 14, 2018
టాలీవుడ్ లో ఈ మద్య కొత్త దర్శకుల జోరు బాగా పెరిగిపోయింది..ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డితో సందీప్ వంగ, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది? సినిమాతో తరుణ్ భాస్కర్, సమ్మోహనంతో ఇంద్రగంటి ఇలా మంచి కంటెంట్ తో తీస్తున్న సినిమాలు సక్సెస్ సాధించడమే కాదు..కలెక్షన్లు కూడా బాగానే వసూళ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు తో తీసిన 'సమ్మోహనం'సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు ఇంద్రగంటి. తన నెక్ట్స్ ప్రాజెక్టుగా ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.
దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోలు ఫిక్స్ అయ్యారు. కాకపోతే అఫీషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదంతే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని, శర్వానంద్ హీరోలుగా నటించబోతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దర్నే హీరోలుగా పెట్టి, ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఇక సినిమా మంచి ఎంట్రటైన్ తో పాటు యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సాగబోతుందట.
ట్విస్ట్ ఏంటంటే..ఈ సినిమాల విశ్రాంతి వరకు ఎవరు హీరో అన్న విషయం సస్పెన్స్ తో ఉండబోతుందట. అంతే కాదు ఈ సినిమాలో ఇద్దరూ కొంత సమయం వరకు నెగిటీవ్ షేడ్స్ లోనే ఉంటారని సమాచారం. హీరో ఎవరనే విషయం సెకండాఫ్ లో రివీల్ అవుతుందట.సాంకేతికంగా ఈ సినిమాలో పెద్దగా మార్పుచేర్పులు ఉండవని తెలుస్తోంది. రెగ్యులర్ గా ఇంద్రగంటి సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్లే దీనికి కూడా వర్క్ చేస్తారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







