భారత్‌లో పెరుగుతున్న హృద్రోగ మరణాలు

- July 15, 2018 , by Maagulf
భారత్‌లో పెరుగుతున్న హృద్రోగ మరణాలు

భారత్‌లో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2015లో దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 25 శాతానికి ఈ జబ్బులే కారణమయ్యాయి. గ్రామీణ ప్రాంతవాసులు, యువకులు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. కెనడాలోని సెయింట్‌ మైకెల్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రపంచ ఆరోగ్య పరిశోధన కేంద్రం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. 2000తో పోలిస్తే 2015 నాటికి గణాంకాల్లో వచ్చిన మార్పులను పరిశోధకులు ఇందులో లెక్కగట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా పక్షవాత కేసుల్లో మరణాల శాతం తగ్గిందని తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com