హైదరాబాద్‌లో ఘరానా మోసం..
- July 16, 2018
హైదరాబాద్‌లో మరో ఘరానామోసం వెలుగుచూసింది. కరక్కాయల్ని పొడి కొట్టిస్తే.. వేలకు వేలు ఆదాయం వస్తుందంటూ మోసగాళ్లు గాలం వేశారు. కేజీకి 300 రూపాయలు ఇస్తామని నమ్మించారు. అయితే.. కరక్కాయలు మాత్రం తమ దగ్గరే కొనాలని మెలిక పెట్టారు. కేజీ కరక్కాయలు వెయ్యి రూపాయలు పెట్టి కొంటే.. పొడి కొట్టినందుకు 300 వస్తాయని ఊరించడంతో అమాయకులు ఎగబడ్డారు.
కరక్కాయల పొడి పేరుతో ఏకంగా 5 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టింది సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టి టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. యూట్యూబ్ ఛానల్, యాప్, పేపర్లలో ప్రకటనలు గుప్పించారు. వెయ్యి పెట్టుబడికి 300 లాభం అంటూ ఊరించారు. ఒక్కొక్కరి నుంచి ఆర్డర్ పేరుతో లక్షలు కట్టించుకుని.. బోర్డు తిప్పేశారు.
కరక్కాయ పొడికి మోసపోయామని గ్రహించిన బాధితులు కూకట్‌పల్లి హోసింగ్ బోర్డులోని ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడి సిబ్బందిని పోలీసులకు పట్టించారు. కేసు పెట్టారు. నెల్లూరుకు చెందిన దేవరాజ్, మేనేజర్ మల్లికార్జున్ ఈ మోసం వెనుక సూత్రధారులుగా తేలింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుల్ని కోరుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







