ఇరాక్ లో కొనసాగుతున్న ఆందోళనలు

- July 17, 2018 , by Maagulf
ఇరాక్ లో  కొనసాగుతున్న ఆందోళనలు

బాగ్దాద్‌ : ఇరాక్‌లోని బాస్రా ప్రావిన్స్‌లో ఆందోళనలు కొనసాగు తున్నాయి. యువతకు ఉద్యోగ అవ కాశాలు, నాణ్యమైన సేవలు అందిం చుటలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు గళమెత్తారు. ప్రాథ మిక అవసరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ నిరసనకారులు విమర్శించారు. ఈనెల8న బాస్రాలోని జుబెయిర్‌ ఆయిల్‌ఫీల్డ్‌ వద్ద నిరసన కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి. 
ఆయిల్‌ఫీల్డ్‌ కార్మికులు నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ ఆందోళన కార్యక్రమాల అణచివేత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న ప్రత్యేక బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టారు. బాష్పవాయుగోళాలు ప్రదర్శించారు. 9రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో మంగళవారం నాటికి ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com