ఉక్రెయిన్ వెళ్తున్న హీరో విక్రం,హీరోయిన్ కీర్తి
- July 17, 2018
చెన్నై: 'సామి' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విక్రం.. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'స్వామి స్క్వేర్' అని పేరు పెట్టారు. హరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఐశ్వర్యా రాజేష్‌లు కథానాయికలుగా నటించారు. తొలిభాగంలో త్రిష పోషించిన పాత్రను ఐశ్వర్యా రాజేష్ కొనసాగిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత బాబిసింహా విలన్‌గా నటిస్తున్నారు. దిల్లీ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా.. రెండో షెడ్యూల్‌ను ఇటీవల చెన్నైలో తెరకెక్కించారు. ఇందులో విక్రం, ఐశ్వర్యా రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారు. ఇదిలా ఉండగా యుగళ గీతాలకు సంబంధించి విక్రం, కీర్తి సురేష్‌లు ఉక్రెయిన్‌కు వెళ్లనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ రెండు పాటలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆగస్టు ఆఖరులో పాటలను విడుదల చేడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబరులో సినిమాను తెరపైకి తీసుకురానున్నారు.ఈ చిత్రాన్ని తమీమ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







