ఒమన్‌లో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

- July 17, 2018 , by Maagulf
ఒమన్‌లో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

మస్కట్‌:అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు పబ్లిక్‌ అథారిటీ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఈ ఘటనలో మృతి చెందగా, బంధువు అయిన మరో బాలిక కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వ్యక్తి పొగ పీల్చడంతో అస్వస్థతకు గురవగా, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ ఘటనపై స్పందిస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి అరబిక్‌ ప్రొఫెసర్‌. అబ్దుల్లా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ హుస్సేని, అరబిక్‌ లాంగ్వేజ్‌ టీచర్‌గా ముసా బిన్‌ అలి ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com