నేనేం తప్పు చేయలేదు:యాంకర్ అనసూయ
- July 19, 2018
యాంకర్ కం.. నటి అనసూయపై మరోసారి నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఇందులో ఆమె తప్పు ఏమి లేకపోయినా.. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్ల నుంచి అనసూయ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.అసలు వివరాల్లోకి వెళితే యాంకర్ అనసూయ నిన్న(బుధవారం) హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 గుండా వెళుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ అనసూయ కారును దాటాడు. అయితే అతను డ్రైవింగ్ సమయంలో మొబైల్ లో వీడియోలు చూస్తున్నాడు. దీంతో అనసూయ ఈ తతంగాన్ని వీడియో తీసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేసింది.
'డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను భయపెట్టిస్తున్నాయి. ఇంతకు ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు.రోడ్లపైకొచ్చి తమకిష్ట మొచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి.. ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని అనసూయ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ వీడియో సందేశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. చీప్ పబ్లిసిటీ స్టంట్ కోసమే ఆమె ఇలా చేస్తోందని పలువురు ట్రోల్ చేస్తూ.. రీట్వీట్లు చేశారు. అయితే వీటిని తాను పట్టించుకోనని.. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే అని వారికీ రీట్వీట్ చేశారు అనసూయ.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







