తమిళనాడు:కాంట్రాక్టర్ ఇంట్లో బంగారం పంట..కరెన్సీ వర్షం
- July 19, 2018
తమిళనాడులో ఓ కాంట్రాక్టర్ ఇంట్లో బంగారం పంట పండుతోంది. కరెన్సీ వర్షం కురుస్తోంది. ఐటీ అధికారులు మూడోరోజు తనిఖీలు కొనసాగించారు. ఇప్పటివరకు 215 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. భారీగం బంగారం బిస్కెట్లు, వజ్రాలు, వీవీఐపీల పేర్లున్న డైరీలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోని సెయ్యాదురై అనే కాంట్రాక్టర్ జాతీయ రహదారుల కాంట్రాక్టు చేస్తుంటాడు. వేల కోట్లకు పడగలెత్తాడు. అయితే.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతున్నాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. సెయ్యాదురై, ఆయన కుమారుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ సెయ్యాదురైకి పళనిస్వామి ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. వారి పలుకుబడితో జాతీయ రహదారుల కాంట్రాక్టులు చేజిక్కించుకునేవాడు. సెయ్యాదురైకి, ఆయన నలుగురు కుమారులకు తమిళనాడు వ్యాప్తంగా 50 ఇళ్లు, కార్యాలయాలు ఉన్నట్టు గుర్తించారు. మూడు రోజుల్లో 215 కోట్ల రూపాయల నగదు.. బంగారం, వజ్రాలు దొరికాయి. ఐటీ అధికారులే బిత్తరపోయేలా స్థిర, చరాస్తులు బయటపడ్డాయి.
తమిళ కాంట్రాక్టర్ సెయ్యాదురై చాలా తెలివిగా సొత్తు దాచుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టు గోడలో రహస్య అరలు ఏర్పాటు చేసుకుని వాటిని.. లాకర్లుగా మార్చుకున్నాడు. అందులోవిలువైన డాక్యుమెంట్లు దాచిపెట్టాడు. రామనాథపురం జిల్లా కముదిలోని ఇంటి గోడలో ఒక రహస్య అరను ఐటీ అధికారులు గుర్తించారు. దాన్ని బద్దలు కొట్టగా విలువైన పత్రాలు దొరికాయి. 15 బ్యాంకు లాకర్లను అధికారులు సీజ్ చేశారు. చెన్నై మైలాపూరులో.. సెయ్యాదురై కుమారుడు నాగరాజ్ అసిస్టెంట్ ఇంట్లో తనిఖీలు చేసి... మూటలకొద్దీ డబ్బు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..