అంతర్జాతీయ యోగా శిక్షకుడిగా బండి రాములుకు గుర్తింపు
- July 20, 2018
యోగా అనగానే చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అనుకుంటారు.. కానీ అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సాధనం, సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం తెలియదు. తనువు, మనస్సు సహా అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా. ఉరుకుల పరుగుల జీవితానికి సాంత్వన చేకూర్చే యోగాను దేశ, విదేశాల్లో ఎందరికో నేర్పుతున్నారు బండి రాములు.
రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన బండి రాములు.. 37 సంవత్సరాల పాటు బహ్రెయిన్‌లో వేల మందికి యోగా శిక్షణ ఇచ్చారు. ప్రముఖ యోగా శిక్షకుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. జీవన విధానంలో యోగాను భాగంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
చిన్ననాటి నుంచి యోగానే..
రాములుకు చిన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొందరి సలహా మేరకు ఆయన యోగా సాధన చేసి, సమస్యను దూరం చేసుకన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన జీవితంలో యోగా భాగమై పోయింది. బ్రహ్మంగారి జీవిత చరిత్ర నుంచి యోగా ప్రాముఖ్యతను గ్రహించి బండిరాములు ఈ దిశగా ప్రయత్నం చేసి యోగాను సంపూర్ణంగా నేర్చుకున్నారు. పుణేకు చెందిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్ అయ్యంగర్ దగ్గర శిష్యరికం చేశారు.
స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి యోగాపై ఆసక్తి కల్పించారు. ఆ తర్వాత బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ 37 సంవత్సరాల పాటు ఎంతో మంది దేశ, విదేశీయులకు యోగా శిక్షణ ఇచ్చాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
మరింత ప్రాచుర్యం కల్పించాలి
యోగా సాధనతో అనేక రకాలుగా మేలు జరుగుతుంది. నాకు ఎలాంటి ప్రతిఫలం రాకున్నా అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ప్రభుత్వం యోగాకు మరింత ప్రాముఖ్యతనిచ్చి, ప్రాచుర్యం కల్పించాలి. మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే యోగాను కేవలం ‘యోగా డే’కే పమితం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







