సింప్లిసిటీకి మారు పేరు ఆర్. నారాయణ మూర్తి...
- July 20, 2018
సింప్లిసిటీకి మారు పేరు.. నటులు ఆర్. నారాయణ మూర్తి.. కోట్లాదిరూపాయల రెమ్యూనరేషన్ కాదని ప్రజలకోసం సినిమాలు తీస్తారన్న నానుడి ఉంది. పీపుల్ స్టార్ గా పేరొందిన అయన ఎక్కడికి వెళ్లినా ఆటో, బస్ లేదా రైల్లో ప్రయాణిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫోటో. ఇవాళ ఆర్. నారాయణమూర్తి వేరే ఊరికి వెళ్లడంకోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వేచిచూశారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న అరుగుపై కుర్చొని టిఫిన్ తింటున్నారు. ఇక ఆర్ నారాయణ మూర్తిని చూసిన ప్రయాణికులు గొప్ప సినిమా స్టార్ అయుండి ఇలా సాధారణ వ్యక్తిలా ఉండటం చూసి మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!