బ్రేకింగ్ : 82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత..
- July 20, 2018
82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలకు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని ముంబైలోని జేజే హాస్పిటల్ కు తరలించారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అస్వస్థతకు గురై ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్‌వర్థన్ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఇతరఖైదీలకు రాకుండా అందరికి మందులు అందజేశామన్నారు.కాగా మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







