ఇస్రో శాస్త్రవేత్తగా మాధవన్!
- July 20, 2018
2016లో వచ్చిన 'ఇరుది సుట్రు' విజయం ఇచ్చిన కిక్క్ను ఏడాది పాటు ఆస్వాధించిన సహజ సిద్ధ నటుడు మాధవన్.. ప్రస్తుతం పలు హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు సంతకాలు చేశారు. తాజాగా శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో ఇస్రో శాస్త్రవేత్తగా నటించనున్నట్లు సమాచారం. అనంత మహదేవన్ దర్శకత్వంలో వస్తున్న నంబి నారాయణన్ బయోపిక్‌లో ఆ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరని అనేక మంది పేర్లను పరిశీలించి చివరకు మాధవన్‌ను ఎంచుకున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో ముఖ్యంగా నంబి నారాయణన్ జీవితంలోని మూడు ప్రధాన ఘట్టాలను దర్శకుడు తెరపై ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా మాధవన్ ఈ చిత్రంలో మూడు రకాలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆఖరులో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, సంగీతం, ఇతర తారాగణం వివరాలు త్వరలో తెలియనున్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







