మోదీ మాటలకు హర్ట్ అయ్యా: చంద్రబాబు
- July 20, 2018
లోక్సభలో తెదేపా అవిశ్వాస తీర్మానం వీగిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ''ప్రధాని చాలా చులకనగా మాట్లాడారు. ఆయన మాటలు బాధకలిగించాయి. నేను యూటర్న్ తీసుకున్నానని రాజకీయ ఎదురుదాడి చేశారు. అవిశ్వాసం పెట్టిన వారికి కాదు, ప్రధానికే అహంకారం ఉంది. నాకు, కేసీఆర్కు గొడవలు ఉన్నట్లు మాట్లాడారు. నీతి తప్పారు, ధర్మాన్ని పాటించలేదు. ఆంధ్రప్రదేశ్ భారత్లో భాగమే కాదన్నట్లు మాట్లాడారు. ఏ మాత్రం అన్యాయం జరిగినా ప్రజలు తట్టుకునే పరిస్థితిలో లేరని చెప్పాం. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగాం. సమస్యలన్నీ నేను సరిచేస్తానని కనీసం 10 నిమిషాలైనా ఎందుకు చెప్పలేకపోయారు? ప్రధాని చులకనగా, చౌకబారుగా మాట్లాడటం బాధకలిగించింది. అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవాల్సిన కర్తవ్యం మీది కాదా'' అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రంపై ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు కలిసిరావడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







