పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్ లో ప్రభుదేవా

- July 20, 2018 , by Maagulf
పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్ లో ప్రభుదేవా

నృత్య దర్శకుడిగా రాణించి ఇండియన్‌ మైకెల్‌గా పేరుగాంచిన ప్రభుదేవా ఎందరో యువ నృత్య దర్శకులకు మార్గదర్శకులయ్యారు. అదేవిధంగా నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న ఆయన వాణిజ్య పరంగా విజయవంతమైన 'దేవి' చిత్రం తర్వాత దూకుడు పెంచారు. తమిళంలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఏసీ ముగిల్‌ దర్శకత్వంలో ఇటీవల ప్రాథమిక పనులు ప్రారంభమైన చిత్రానికి అధికారికంగా 'పొన్‌ మాణిక్యవేల్‌' అనే పేరు పెట్టారు. ఇందులో ప్రభుదేవా తొలిసారిగా పూర్తిస్థాయి పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. విశేషమేమిటంటే ఏసీ ముగిల్‌ గతంలో ప్రభుదేవాకు సహాయకుడిగా పనిచేశారు. ఆయన గతంలో పొక్కిరి, విల్లు చిత్రాలకు పనిచేశారు. నివేద పెతురాజ్‌ కథానాయికగా, జె.మహదేవన్‌, సురేష్‌ మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం అందిస్తుండగా...

ప్రభుదేవాతో ఆయనకు ఇదే తొలి చిత్రం. దీనికంటే ముందు దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ నేతృత్వంలో ప్రభుదేవా నటించిన.. నృత్య నేపథ్యంలో వస్తున్న 'లక్ష్మి'ని సెప్టెంబరులో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిత్రానికి 'పొన్‌ మాణిక్యవేల్‌' అని పేరు పెట్టడం వెనుక...

ఇటీవల రాష్ట్రంలో చోరీ అయిన విగ్రహాలను గుర్తించి తిరిగి రాష్ట్రానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఐజీ పొన్‌ మాణిక్యవేల్‌ పాత్ర నేపథ్యమేననే విషయం వ్యక్తమవుతుండటం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com