`నర్తనశాల` ఫస్ట్‌లుక్‌!

- July 20, 2018 , by Maagulf
`నర్తనశాల` ఫస్ట్‌లుక్‌!

`ఛలో` సినిమాతో ఘనవిజయం అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం `నర్తనశాల` సినిమాలో నటిస్తున్నాడు. `ఛలో` సినిమాను నిర్మించిన నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. డ్యాన్స్ వేస్తున్న నాగశౌర్య స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. `ఛలో` సినిమా తర్వాత వచ్చిన `కణం`, `అమ్మమ్మగారిల్లు` సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న నాగశౌర్యకు `నర్తనశాల` ఆశించిన విజయం అందిస్తుందేమో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com