ముగిసిన బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు
- July 20, 2018
కేప్‌టౌన్ : బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు ముగిశాయి. 2018- 19లో మీడియా సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ప్రధాన స్రవంతి లోని మీడియా సంస్థల నేతల మధ్య అంగీకారం కుదిరింది. బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర, బాధ్యత, బ్రిక్స్ దేశాల్లోని కొత్త మీడియా సంస్థల మధ్య, అలాగే బ్రిక్స్, ఆఫ్రికాల మధ్య మీడియా సహకారాన్ని పెంచడం వంటి అంశాలతో సహా పలు అంశాలపై చర్చలు, పరస్పర అభిప్రాయాల మార్పిడి అనంతరం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు, అస్థిరతకు గురిచేసే అంశాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం పెను మార్పులకు గురవుతోంది. అనేక సద్దుబాట్లు చోటు చేసుకుంటున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. కానీ, ఉమ్మడి లక్ష్యంతో కూడిన కమ్యూనిటీని నిర్మించడం మానవాళి అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా మిగిలే వుందని ప్రణాళిక తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







