రంగస్థలం ‘జిగేల్ రాణి’ సింగర్‌కు సుకుమార్ సాయం
- July 20, 2018
సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ‘జిల్.. జిల్.. జిగేల్ రాణి’ పాటను పాడిన సింగర్‌కు సూకుమార్ ఆర్థిక సాహయం చేశారు. విశాఖపట్నం జిల్లాలో చిల్లర కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న గంటా వెంకటలక్ష్మి ఈ పాటను ఆలపించారు. వెంకటలక్ష్మి బుర్రకథను సామాజిక మాధ్యమాలలో చూసిన దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ రంగస్థలంలో సినిమాలో జిగేల్ రాణి సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. అయితే వెంకటలక్ష్మి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ మారింది. పాట రికార్డు పూరైన తర్వాత సినిమా యూనిట్ తనను ఏమాత్రం పట్టించుకోలేదాని తనను తీసుకోచ్చిన మధ్యవర్తి డబ్బులు ఇవ్వలేదంటూ వాపోయారు. వెంకటలక్ష్మి విషయం తేలుసుకున్న దర్శకుడు సుకుమార్ ఆమెకు అండగా నిలిచారు. లక్ష రూపాయల చెక్కును పారితోషకంగా అందించారు. ఫోన్ నంబర్ అందుబాటులో లేకపోవడం వలనే ఆమెను రంగస్థలం’ సినిమా 100 రోజుల వేడుకకు పిలవడం కుదరలేదన్నారు సుకుమార్.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







